సిమెంట్ రోడ్డును ప్రారంభించిన జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక రైలుపేట 1వ లైన్ నందు నూతన సిమెంట్ రోడ్డును ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఆయన తెలిపారు. సుపరిపాలన ప్రారంభ సమయంలో ఈ వార్డుకు వచ్చానని, అప్పుడు ప్రజలు రోడ్డు అధ్వానంగా ఉందని తన దృష్టికి తేగా తక్షణం అంచనాల వేసి సిమెంట్ రోడ్డు నిర్మించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించడం జరిగిందని. చెప్పిన 20 రోజుల్లోనే సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, అది సుపరిపాలన అని అన్నారు. నేడు ఈ రోడ్డు ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story:సిమెంట్ రోడ్డును ప్రారంభించిన జీవి)

