Homeవార్తలుతెలంగాణప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన: రమేష్

ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన: రమేష్

ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన: రమేష్

న్యూస్‌తెలుగు/వనపర్తి : సిపిఐ 4వరాష్ట్ర మహాసభలు ప్రజా సమస్యలపై పోరాటాల రూపకల్పనకు వేదిక కాలు ఉందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు. శనివారం పెబ్బేర్ లో సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను విడుదల చేసి మాట్లాడారు. మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో మహాసభలు ఆగస్ట్ 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మహాసభ చర్చిస్తుందని పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మతం పేరుతో దేవుళ్ళ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న బిజెపి బండారాన్ని మహాసభల్లో ఎండగట్టటం జరుగుతుందన్నారు. బిజెపి వ్యతిరేక శక్తులను బలోపేతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తారు అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడిచిన సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సంపన్నులు ఆదాయం మాత్రం పెరిగిందన్నారు. ప్రధాని మోదీ మాటలు గారడిని తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు నలుమూలల నుంచి ప్రతినిధులు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ పెబ్బేరు మండల సహాయ కార్యదర్శులు పెద్ద మొగులయ్య, గాంధీ, నాయకులు శాంతమూర్తి, పెద్ద మన్యం, రిక్షారాములు, గంధం శివ, ఎస్.చంద్రయ్య, జి.లక్ష్మన్న,గొర్ల వెంకటన్న, గంధం కృష్ణయ్య, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన: రమేష్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!