నిర్మల స్కూల్ ఉపాధ్యాయురాలు కొండ్రు ఝాన్సీ ఉద్యోగ విరమణ
న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక నిర్మల గర్ల్స్ హై స్కూల్ నందు ఉపాధ్యాయురాలు కొండ్రు ఝాన్సీ ఉద్యోగ విరమణ కార్యక్రమం లో ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఝాన్సీ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో చేసిన సేవలను జీవి కొనియాడారు. ఆమె ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకురాలిగా నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. (Story:నిర్మల స్కూల్ ఉపాధ్యాయురాలు కొండ్రు ఝాన్సీ ఉద్యోగ విరమణ)
