నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక తాము మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నామని తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున వారి చికిత్సకు సరిపోయేంత LOC లను మంజూరు చేయించి తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జూలై నెల 30 రోజుల్లో రోజుకో LOC చొప్పున 29 LOCలను మంజూరు చేయించారు. అదేవిధంగా జులై నెలలో రూ. 68 లక్షల 80 వేల విలువగల 239 CMRF చెక్కులను సైతం ఎమ్మెల్యే మంజూరు చేయించారు .ఈ సందర్భంగా ఆయన రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన కల్వకోలు సత్యం గారూ మెరుగైన వైద్యం చేయించుకునేందుకు రూ. 5లక్షలు, ప్రస్తుతం మరో రూ.3 లక్షలు మొత్తం రూ. 8 లక్షల విలువగల LOC నీ Mla బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు
పార్టీలకతీతంగా తన, మన బేధం లేకుండా ఆపదలో ఉన్నానంటే ఆయన ఆలోచించకుండా అపన్న హస్తము అందిస్తూ వస్తున్నారు . ఈ విధంగా ఒక్కో నెలలో రోజుకు ఒకటి, రెండు LOC లను
300 నుంచి 400 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయిస్తూ నిరుపేదల ఆరోగ్యాభివృద్ధికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Story:నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే )
