Home వార్తలు తెలంగాణ పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్‌ ప్రధానం

పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్‌ ప్రధానం

0

పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్‌ ప్రధానం

న్యూస్‌తెలుగు/వనపర్తి : గత 18 ఏళ్లుగా ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాడుతూ, సామాజిక సేవలో విశేషంగా పేరు తెచ్చుకున్న వనపర్తి మాజీ కౌన్సిలర్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. 16 తేదీ శనివారం మధ్యానం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో United Nation I P U J యూనివర్సిటీ ప్రతినిధులు ఈ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు ఈ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి సామాజిక సేవ _ ప్రజల శ్రేయస్సు విభాగంలో సతీష్ యాదవ్ ను ఎంపికచేసారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి, నా సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, ఈ రోజు కృష్ణాష్టమి రోజున అందుకోవడం నా అదృష్టం అని అలాగే ఇది నాకు మరింత బాధ్యతను పెంచిందనీ సతీష్ యాదవ్ తెలిపారు.
నాకు లభించిన గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజానీకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఇది రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story:పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్‌ ప్రధానం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version