తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
న్యూస్తెలుగు/వనపర్తి : తెలంగాణ రైజింగ్ 2047″తో 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువా తో సత్కరించారు. వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, హాజరయ్యారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీరా రెడ్డి, డీఎస్పీలు, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, చిన్నారులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. (Story:తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం)

