Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ “స్త్రీ శక్తి” ఉచిత బస్సులు ప్రారంభించిన జీవి

“స్త్రీ శక్తి” ఉచిత బస్సులు ప్రారంభించిన జీవి

0

“స్త్రీ శక్తి” ఉచిత బస్సులు ప్రారంభించిన జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొచ్చర్ల గ్రామం నుండి వినుకొండ బస్టాండ్ వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుందని, ఇది వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని ఆయన తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:”స్త్రీ శక్తి” ఉచిత బస్సులు ప్రారంభించిన జీవి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version