ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ
దేశంలో సృష్టించబడుతున్న సంపద అర్హులైన నిరుపేదలకు అందడం లేదు
మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శివయ్య భవనంపై భారత జాతీయ పతాకాన్ని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 79 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఇంకా పేదరికం గురించి, దేశంలో పొగవుతున్న సంపద అర్హులైన పేదలకు అందడం లేదని, ధనిక పేద తారతమ్యాలు పెరిగిపోయాయని, శ్రమశక్తి దోపిడీకి గురవుతోందని, శ్రమకుతగ్గ ఫలితం కావాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని, మతోన్మాద పోకడలతో మైనారిటీలపై దాడులు హత్యకాండలు పెరిగిపోయాయని, కుల దురహంకారం పెరిగి పోయిందని, అక్రమ అరెస్టులు అక్రమ కేసులు ఈ విధంగా దేశంలో అనేక సాంఘిక బహిష్కరణలు ఆర్థిక దోపిడి అరాచకాలు అంటరానితనం దేశ సంపదను కొల్లగొట్టే వారికి పెద్ద పదవులు రాజ్యాంగం ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంటే ప్రశ్నించే వారిపై పోలీస్ కేసులు ఈ పరిస్థితులలో నేటి మన79వ భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని పాలకులు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట వచ్చిన తర్వాత మరొక మాట ఎన్నికల వ్యవస్థ డబ్బుతో ప్రహసనంగా మారిపోయిందని పౌరుడి ఓటు హక్కు నవ్వుల పాలవుతోందని ఈ వ్యవస్థలో మార్పు అనివార్యంగా రావాలని కమ్యూనిజం ఈ దేశానికి అనివార్యంగా అవసరమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి ప్రజల పక్షాన కార్మికులు రైతుల పక్షాన నిలబడుతున్న కమ్యూనిస్టులను అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ దేశంలో సృష్టించబడుతున్న సంపద పేద ప్రజలకు చేరేవరకు దేశాభివృద్ధి కొరకు నిరంతరం ప్రజాసేవలోనే ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, రాయబారం వందనం, పొట్లూరి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, జల్లి వెంకటేశ్వర్లు, సోడాల సాంబయ్య, రమణారెడ్డి, సుబేదార్ యూనిస్ రమణారావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story:ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ)
