తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కెసిఆర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : బి.ఆర్.ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబ్ కాలము నుండి తెలంగాణ అభివృద్ధి కొనసాగింది అని ఆంధ్ర పాలకుల కుట్రలు,కబంధ హస్తాలనుండి తెలంగాణను విముక్తి చేసి సాగునీటి ప్రాజెక్టులు,వైద్య,విద్యా రంగాలలో సుస్థిర అభివృద్ధిని చేసి చూపెట్టింది కె.సి.ఆర్ గారిని కొనియాడారు. 10ఏండ్ల కె.సి.ఆర్ పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి గోదావరి నదీజలాలను సద్వినియోగ పరుస్తూ లక్షల ఎకరాలకు నీళ్లు అందించి వ్యవసాయ రంగాన్ని సస్యసామలం చేసింది కె.సి.ఆర్ గారిని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి పోచంపాడు ప్రాజెక్టు కింద మిగిలిపోయిన ఆయకట్టుకు ,ఉత్తర తెలంగాణకు సాగునీళ్లు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణను సస్యశామలం చేశామని నిరంజన్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వ్యయంతో నిర్మించినారని విమర్శించే కుహన మేధావి వర్గం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ 82వేల కోట్లతో ఎన్నో ఎత్తిపోతల ద్వారా చంద్రబాబు నిర్మించే బనకచర్లను ఎందుకు వ్యతిరేకించరని ఆయన ఘాటుగా విమర్శించారు.
మరో స్వాతంత్ర పోరాటం మాదిరిగా ఉద్యమం నడిపి 10ఏండ్ల అధికారంలో సాగు,తాగు,విద్యా, వైద్యం రంగాలలో తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపినామని అన్నారు . కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లు అందించి పంజాబ్ తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల సాధించి రైతులను రాజులుగా మలిచింది బి.ఆర్.ఎస్ ప్రభుత్వమని అన్నారు. 1948నుండి స్వాతంత్ర తెలంగాణను నిలకడ ఉండనివ్వకుండా రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేశాయని ఆయన ఆరోపించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నదని తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే మరోసారి కె.సి.ఆర్ గారు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,గంధం. పరం జ్యోతి,మండల పార్టీ అధ్యక్షులు,మాణిక్యం,వనం.రాములు,బాలరాజు,కర్రెస్వామి,దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, జాతృనాయక్,వేణు నాయుడు,మాజీ కౌన్సిలర్స్ కాగితాల.లక్ష్మీనారాయణ,బండారు.కృష్ణ,ఉంగ్లం. తిరుమల్, నాగన్న యాదవ్,కంచ.రవి,గులాం ఖాదర్ ఖాన్, ఎల్లారెడ్డి,ఎద్దుల.సాయికుమార్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,రమేష్ నాయక్,మతీన్,చిట్యాల.రాము, జోహెబ్ హుసేన్,నందిమల్ల. రమేష్,సేనాపతి,ఇమ్రాన్,నందిమల్ల.రమేష్,మహేశ్వర్ రెడ్డి, బాగ్యరాజ్,బెంగాలీ.రఘు,గంధం.విజయ్,నదిమల్ల.సుబ్బు, ఆరీఫ్, వజ్రాల.రమేష్,తదితరులు పాల్గొన్నారు. (Story: తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కెసిఆర్)

