భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
న్యూస్ తెలుగు/సాలూరు : అరకు పార్లమెంట్ పరిధిలో గల రెండు జిల్లాలు మన్యం జిల్లా మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాలలో భారీ వర్షాల కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న విద్యార్థులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు.
రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.
గిరిశిఖర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లపై రాకపోకలు బంద్ కావడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.. కావున అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేశారు ఈ వర్షాలు పై విషయాలన్నీ కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ తో చర్చించడం జరిగిందని. తెలియజేశారు. (Story:భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)
