కంబాలపురంలో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామానికి చెందిన మేకల వెంకటస్వామి కుమారుడి వివాహానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు వివాహ బంధం నూరేళ్ల పంటగా ఉంటుందని హిందూ సాంప్రదాయాల్లో వివాహానికి ఎంతో ప్రత్యేకత ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శ్రీరంగాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:కంబాలపురంలో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే)
