అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సదస్సుకు చిగుర్లపల్లి ఎంపిక
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఈ నేల 13 నుంచి 18వ తేదీ వరకు వియత్నం దేశంలో అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సదస్సుకు వనపర్తి జిల్లా నుంచి ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ రవి చిగుర్లపల్లి ఎంపిక అయ్యారని DRM విజయ్ చౌదరి ,DSM దిలీప్ రెడ్డి బ్రాంచ్ మేనేజర్ కిష్టయ్య సీనియర్ బిజినెస్ మేనేజర్ వెంకట్ రావు లు తెలిపారు. ఆయన అందించిన సేవలకు గాను ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం తో పాటు,ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించినందుకు గాను ఈ సదస్సుకు ఎంపిక అయ్యారని వివరించారు.వియత్నం లో జరిగే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సదస్సులో ఉత్తమ ఇన్సూరెన్స్ ఏజెంట్ (డైమండ్) అవార్డు అందుకోబోతున్నందున వారు అభినందనలు తెలిపారు. (Story:అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సదస్సుకు చిగుర్లపల్లి ఎంపిక)