Homeవార్తలుతెలంగాణరెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ఖీమ్యా నాయక్

న్యూస్‌తెలుగు/వనపర్తి : బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ రేవల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భూభారతి రెవెన్యూ సదస్సులపై దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని రెవెన్యూ సిబ్బందిని సూచించారు. ముఖ్యంగా భూభారతి సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం రికార్డు రూమ్‌ను పరిశీలించి, అన్ని రికార్డులను సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథం, రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు. (Story: రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!