పెబ్బేరు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల చేత మాదక ద్రవ్యల నిరోధక ప్రతిజ్ఞ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మాదకద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు, సిగరెట్ ఆల్కహాల్ గంజాయి , బ్రౌన్ షుగర్, ఓపియం ,డెమోరాల్ మొదలైనవి మత్తుగా గమ్మత్తుగా మనిషిని ఇచ్చి చేస్తాయని వీటి జోలికి ఎవరు వెళ్లకూడదని, చెడు అలవాళ్ళకు బానిస కాకూడదని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఓబుల్ రెడ్డి విద్యార్థులు తెలియజేశారు.
కళాశాల డ్రగ్స్ ట్రైనర్ పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు సి కృష్ణయ్య మాట్లాడుతూ, ఒక టీనేజర్ గాని ఒక యూత్ గాని, విద్యార్థులు గాని, సరదా కనో , పార్టీల వలన, ఫంక్షన్ల వలన, పని ఒత్తిడిల వలన, లేదా ఎక్స్పరిమెంట్ మేడ్ చేద్దామని, అలా డ్రగ్స్ కు ఎడిట్ అయితే, జీవితం మొత్తం బానిసై, నిద్ర పట్టకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, వణుకు, గుండె దడ, జుట్టు రాలిపోవడం, శరీరం పొడిబారిపోవడం జరిగి, అసలైన ఆనందాన్ని విలువైన జీవిత సమయాన్ని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఓబుల్ రెడ్డి, అధ్యాపకులు కృష్ణకుమారి, సి కృష్ణయ్య, జ్ఞానేశ్వర్ రెడ్డి, నవీన్ కుమార్, వెంకటలక్ష్మి, శిల్ప, ఈశ్వర్, బోధ నేతర సిబ్బంది, కర్ణాకర్, వెంకటేష్, విమలాదేవి, మద్దిలేటి, వేణు, మరియు విద్యార్థులు, డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. (Story:పెబ్బేరు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల చేత మాదక ద్రవ్యల నిరోధక ప్రతిజ్ఞ )