రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
న్యూస్ తెలుగు/సాలూరు : రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు పట్టణంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి 14 వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన *”అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ ని సాలూరు ఘనంగా, ఆమె ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం, పంటల అభివృద్ధి, సాగునీటి విస్తరణ, పంట నష్టపరిహారం వంటి అంశాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అని తెలిపారు.సాలూరు నియోజకవర్గంలోని అనేక పంచాయతీలు, గ్రామాలనుండి ట్రాక్టర్ ర్యాలీలలో రైతులు పాల్గొన్న చాలా సుపరిణామం అని అన్నారు.అన్నదాతలే మా ప్రథమ ప్రాధాన్యమని, రాష్ట్రంలోని ప్రతి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ₹20,000 ఆర్థిక సహాయం అందించామని. పంటలు కోత పూర్తయ్యిన 48 గంటలలోపే రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరదలు, వర్షాభావం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర సమస్యలతో బాధపడుతున్న రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు, పంట నష్టపరిహారం అందించామని అన్నారు. పోలవరం, హంసపాడు,సుజల స్రవంతి వంటి సాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతున్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించిన విషయాన్ని ప్రస్తావించారు.సాలూరు నియోజకవర్గ రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించడం సంతోషంగా ఉందని అన్నారు.గిట్టుబాటు ధర, సాగునీటి సదుపాయాలు, పంట నష్టపరిహారం వంటి అంశాలలో ప్రభుత్వం చూపుతున్న చురుకుదనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేశారు.ఈ విజయోత్సవ ర్యాలీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృతమైన అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. అన్నదాతకు అండగా ఈ ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ర్యాలీ మంత్రి క్యాంపు కార్యాలయం నుండి సాలూరు బోసు బొమ్మ జంక్షన్, గొల్ల వీధి, వెంకటేశ్వర డీలక్స్ , కోటవీధి, పెద కోమటిపేట, డబ్బి వీధి వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేశు, పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడెపు యుగంధర్, మక్కువ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు మహిళలు పాల్గొన్నారు.(Story :రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది )

