హర్ష చికెన్ సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పానగల్ రోడ్డు నందు పెద్దముక్కుల.మహేష్ గారి నూతన హర్ష చికెన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ నాణ్యవంతమైన,ఆరోగ్యమైన ఆహారం అందిస్తే ప్రజలు మన్నిస్తారని అంతేకాకుండా యువత ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాథి ఏర్పాటు చేసి పదిమందికి ఉపాధి,భవిష్యత్తు జీవనోపాధి కల్పించి ఆదర్శప్రాయులుగా నిలవాలని ఆకాంక్షించారు.
పెద్దముక్కుల.మహేష్ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల.అశోక్,విజయ్ కుమార్,ధర్మా నాయక్, కంచె.రవి,సదుర్ల.రమేష్,పెద్దముక్కల.రవికుమార్,చిట్యాల.రాము,కొమ్ము.శ్రీనివాస్,ఎంట్ల.శ్రీను,నాగవరం యువత ఉన్నారు. (Story:హర్ష చికెన్ సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి)
