Homeవార్తలుతెలంగాణసీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి

సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి

సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి, సీఎంఆర్ఎఫ్ 110చెక్కులను 38,21,500 /-రూపాయలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నామని అన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించటం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ లేనివారికి చికిత్స అనంతరం సిఎంఆర్ఎఫ్ ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను గుర్తించి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం పేదోళ్ల ఆరోగ్యానికి కొండంత ఆసరా గా నిలుస్తుందని అన్నారు.వనపర్తి నియోజకవర్గం లో పార్టీలకు అతీతంగా మానవతా ధృక్పథంతో అందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నామని అన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్ మియా, వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్ ,వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి.పెంటన్న యాదవ్, శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు రాములు యాదవ్,వనపర్తి జిల్లా ఎన్.ఎస్.యు.ఐఅధ్యక్షుడు రోహిత్, వనపర్తియూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రాగి అక్షయ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇర్ఫాన్ , పెద్దగూడెం మాజీ సర్పంచ్ జానకమ్మ, కొండన్న,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , రాగి వేణు, కోళ్ల వెంకటేష్,వెంకటేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా,మణిగిల్ల బాల్ రాజు, హరి బాబు రెడ్డి,మన్యం,గోవింద్, రాములు, ఎంట్లరవి,బాలచందర్, రఘు, రమేష్, సహదేవుడు ,గోవర్ధన్, బాల్రాజ్ ,పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, తదితరులు పాల్గొన్నారు. (Story:సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!