బస్సు సౌకర్యం కల్పించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ల, కాలేజీల నుండి బస్సు సౌకర్యం కల్పించాలనీ. విద్యార్థులను సకాలంలో పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలనీ ఆర్టీసీ డిఎంకు వినతిపత్రం సమర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక. రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్ దగ్గరకు వెళ్లి విద్యార్థుల సౌకర్యార్థం ప్రయాణ సమస్యలపై వినతి పత్రం సమర్పిoచి ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కాలేజీ, పాఠశాలలకు హాస్టల్ లు దూరంగా ఉండడంతో ,విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వేరే సమయం తక్కువగా ఉండడంతో ఆ దూరం నడవలేక లేటుగా వెళ్లి ప్రతిరోజు అధ్యాపకులచే తన్నులు తింటూ చదువు చదవలేక, సకాలంలో పోలేక వారి చదువులకు ఆటంకం కలుగుతుందని వెంటనే సంబంధిత అధికారులు కల్పించుకొని జిల్లా కేంద్రంలో ఉన్న దూర ప్రాంతాలకు హాస్టల్ నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థుల సకాలంలో స్కూల్లకు కాలేజిలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు,కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు, రామస్వామి, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.(Story : బస్సు సౌకర్యం కల్పించాలి )

