Home వార్తలు తెలంగాణ చట్ట ప్రకారం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

చట్ట ప్రకారం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

0

చట్ట ప్రకారం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : చట్ట ప్రకారం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే మిల్లులకు అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కీమ్య నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ పెద్దమందడి మండలములో పర్యటిస్తూ మోజర్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బాయిల్డ్ రాయిస్ మిల్లును పరిశీలించారు.మిల్లు స్థాపనకు అనుమతి మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా, ఆయన మిల్లు యజమానులతో మాట్లాడి, అన్ని భద్రతా ప్రమాణాలు మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు సరైన ధర లభించడంలో ఇటువంటి మిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అయితే పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అనంతరం పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, భూభారతి రెవెన్యూ సదస్సుల పురోగతిని సమీక్షించారు.భూభారతి రెవెన్యూ సదస్సుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరచవచ్చని ఆయన అన్నారు. ఆయన వెంట డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, తహసిల్దార్ సరస్వతి తదితరులు ఉన్నారు.(Story : చట్ట ప్రకారం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version