కామ్రేడ్ సిద్ధాబత్తుల రామచంద్రరావు మృతి
న్యూస్ తెలుగు /సాలూరు : ఉమ్మడి విజయనగరం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులుగా, ఏఐటియుసి జిల్లా అధ్యక్షునిగా, సాలూరు మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా, సాలూరు పట్టణ కౌన్సిలర్ గా విధులు నిర్వహించిన కామ్రేడ్ సిద్ధాబత్తుల రామచంద్రరావు మంగళవారం రాత్రి ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్, ఉమ్మడి విజయనగరం జిల్లా సిపిఐ కార్యదర్శి ఓమ్మి రమణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అలమండ ఆనందరావు, సిపిఎం సాలూరు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఎన్ వై నాయుడు, మరి శ్రీనివాసరావు, సాలూరు కళాసి సంఘం యూనియన్, మోటారు వర్కర్స్ యూనియన్, ఆటో డ్రైవర్లు యూనియన్, మొదలైన ప్రజా సంఘాల నాయకులు ఆయన పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ సాలూరు పట్టణం ఒక పోరాట యోధుడిని కోల్పోయిందని. ఆన్నారు. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు దక్కవలసిన హక్కులను సాధించడంలో ఆయన ముందు ఉండే వారని తెలియజేశారు. కార్మికులకు పెద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు కృషి చేసే వారని అన్నారు. భూ పోరాటలు చేసి చాలామంది నిరుపేదలకు ఆయన సాగు భూములు వచ్చేటట్లు కృషి చేశారని అన్నారు. ఉద్యమం ఊపిరిగా ఆయన చేసిన పోరాట పటిమ మరువలేదని అన్నారు. (Story: కామ్రేడ్ సిద్ధాబత్తుల రామచంద్రరావు మృతి)

