తల్లిపాల వారోత్సవ ర్యాలీ
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవం పై అంగన్వాడీల చిన్నారుల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని వినుకొండ పట్టణంలోని కట్టకింద బజార్ సచివాలయం పరిధిలో ఉన్న అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఏ సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ శేష కుమారి సూచించారు. అంగన్వాడి సెంటర్ ల నుండి గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పోషక ఆహారాన్ని సమయానికి అందుకొని, సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని, బిడ్డకు ఎంత ముఖ్యమో చిన్నారుల ఆరోగ్య క్షేమం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వం అందించే పాలు, గుడ్లు, బాలామృతం తప్పనిసరిగా చిన్నారులకు అందించాలని, అలాగే గర్భిణులకు, బాలింతలకు ఇస్తున్న పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు షేక్.రజియా, షేక్.నీలిమ, షేక్.జాన్ బి, వై.నీరజ, అంగన్వాడి సిబ్బంది, గర్భవతిలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story:తల్లిపాల వారోత్సవ ర్యాలీ)

