Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గిరిజన రైతులకు అండగా ఉంటాం

గిరిజన రైతులకు అండగా ఉంటాం

గిరిజన రైతులకు అండగా ఉంటాం

న్యూస్ తెలుగు /సాలూరు : గిరిజన రైతులకు అండగా ఉండి వారి పక్షాన నిలబడి పోరాడుతామని మాజీ ఉపముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్నదొర బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి. వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బుధవారం రామభద్రపురం మండలం కాకర్లవలస,కారేడు వలస గిరిజన గ్రామాల భూములను రైతులతో కలిసి సందర్శించి నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎంఈ పార్క్ ఇక్కడ వద్దు మా భూములను కాపాడండి, మాకు న్యాయం జరిగేలా చూడండని వైసిపి నాయకులు ఎదుట గిరిజన గ్రామాల రైతులు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఇరువురు మాట్లాడుతూ సాలూరు మండలానికి ఆనుకోని ఉన్న రామభద్రపురం మండలం కాకర్ల వలస,కారేడువలస గిరిజన గ్రామాల రైతులు చాలా రోజులుగా భూ సమస్యలపై పోరాడుతున్నరని తెలిపారు. పెద్దలందరిని, రైతులని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి రైతులకు ముందు భూములను చూపించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇప్పించండని తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్తున్నారని ఇదేనా న్యాయం చేయడము అని అన్నారు.2000 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం ఉందని ఆ చట్టంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములు వారే పంటలు చెట్లు నాటుకోవచ్చుని ఉందని అన్నారు. వీరికి ప్రభుత్వం పట్టాలు కూడా మంజూరు చేసిందని వీరికి వేరే భూమి చూపించి తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో రామభద్రపురం ఎంపీపీ చొక్కాపు.లక్ష్మణరావు మిర్తి వలస సర్పంచ్ మజ్జి రాంబాబు, వైసిపి నాయకులు పత్తి గుళ్ళ ఏక్ నాద్, షణ్ముఖరావు, పతేడ చంద్రశేఖర్ సాలూరు,రామభద్రపురం మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story:గిరిజన రైతులకు అండగా ఉంటాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments