Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సాలూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

సాలూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

0

సాలూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

న్యూస్ తెలుగు/ సాలూరు : రైతులు యూరియాను మోతాదుకు మించి వేసినట్లయితే తెగుళ్లు, పురుగులు వచ్చే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి కె శిరీష తెలిపారు. మంగళవారం సాలూరు మండలం ఖారాసవలస మరియు కొత్తవలస గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కె వి కె రాస్తాకుంట బాయ్ ఎస్ ఎం ఎస్(సబ్జెక్టు మేటర్ స్పెషలిస్ట్ ) అమృత వీణ పాల్గొని మాట్లాడుతూ వరి, మరియు మొక్కజొన్న లో యాజమాన్య పద్దతలు తెలియజేశారు., వెర్ట్నరీ డాక్టర్ కోళ్లు అను మాట్లాడుతూ పెంపకం మరియు ఆవు ల్లో, గొర్రెలు లో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వ్యవసాయ అధికారి శిరీష మాట్లాడాతూ రైతులు యూరియా మోతాదుకు మించి వినియోగించడం వలన పంట పురుగులు మరియు తెగుళ్ల బెడదకు గురి అవుతుందని తెలిపారు. తగిన మోతాదులో మాత్రమే యూరియా పంటకు వినియోగించాలని తెలియచేశారు. అలానే రైతులందరూ వ్యవసాయ సహాయకులు ని సంప్రదించి ఈ పంట తప్ప కుండా నమోదు చేసుకోవాలని తెలియచేశారు.ప్రస్తుతం వరి పంట కి ఎకరా కు 800 కట్టి పంటల భీమా చేయించుకోవాలని అన్నారు. ఈ నెల 15 వరుకు టైం ఉందని , దగ్గర లో ఉన్న ఈ సేవ లో కట్టుకోవాలని తెలియజేశారు.,ఈ కార్యక్రమం లో ఖారాసవలస సర్పంచ్ ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి, వ్యవసాయ విస్తరణ అధికారి మరియు వ్యవసాయ సహాయకులు వినోద్ కుమార్ రైతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. (Story:సాలూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version