Home వార్తలు తెలంగాణ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ

0

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ వీపనగండ్ల , చిన్నంబావిలోని తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చే రైతులను అనవసరంగా తిప్పుకోవద్దని, వారి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, భూభారతి దరఖాస్తులు, సాదా బైనమా, పెండింగ్ మ్యుటేషన్, సక్సెషన్ వంటి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు. వీపనగండ్ల మండలంలో 1,115 భూభారతి దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియలు నిర్దేశిత సమయాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. (Story:అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version