వినుకొండలో తల్లిపాల వారోత్సవాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని ఏ సెక్టార్ నందు లైబ్రరీ బజార్ అంగనవాడి సెంటర్లలో తల్లిపాల వారోత్సవాలు సోమవారం నిర్వహించారు. ఈనెల 1వ తారీకు నుండి 7వ తారీఖు వరకు 7 రోజులపాటు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలను 6 నెలల లోపు బాలింతలను ఆహ్వానించి వారికి తల్లిపాలపై అవగాహన కల్పించడం మరియు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టాలని మరియు బిడ్డకు ఆరు నెలలు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ శేషాకుమారి, హెచ్. వి. మేడం కమల బాయి, ఏఎన్ఎం అశ్విని, అంగన్వాడి కార్యకర్తలు జి. సుజాత, ఏ. రత్నకుమారి, సిహెచ్ సుచరిత, ఎం. రమాదేవి, ఎస్. ఉమామహేశ్వరి, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో తల్లిపాల వారోత్సవాలు )
