Homeవార్తలుతెలంగాణరైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

గిరిజన మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరులో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

న్యూస్ తెలుగు /సాలూరు : అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు మెంటాడ వీధి లో ఉన్న కోదండరామా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ-పియం కిసాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేటి నుండి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పధకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో 1,22,260 మంది రైతులు
ఇ-పంట తదితర అన్ని అంశాలను పూర్తి చేసుకుని అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పధకం క్రింద రూ. 20 వేలు చొప్పున మొత్తం రూ.84.58 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ఆమె అన్నారు. ఒకటో తారీకునే వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు నూరు శాతం పెన్షన్ వేయడం జరిగిందన్నారు. దేశంలో నెలకు రూ: 4 వేలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి చoద్రబాబు పెద్ద కొడుకుగా వారి అవసరాలను తీరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం ఖచ్చితంగా అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదని అది ప్రభుత్వ బాధ్యతని మంత్రి తెలిపారు.
ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి రూ.20 వేలు ఇవ్వనునట్టు మంత్రి అన్నారు. మొదటి, రెండో విడతల్లో రూ. 5 వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వివరించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే కృషి చేస్తోoదన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతీ రైతుకు ప్రభుత్వం మూడు దఫాలుగా రూ: 20 వేలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయంగా తోడ్పడుతుందని, రైతుకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని వారు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రెట్టింపు ఆదాయం సమకూరుతుందన్నారు. రైతులకు నవధాన్యాల విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని, రైతులు వాటిని వినియోగించడం వల్ల అధిక దిగుబడి వస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రతీ తన పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సమస్యను అధిగమించవచ్చని అన్నారు.
డి సి సి బి చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. వారికి కావాల్సిన లోన్లు త్వరతగతిన ఇస్తామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
మండలాల వారీగా రైతులు – జమ కానున్న అన్నదాత సుఖీభవ వివరాలు
సాలూరు: 11,078 మంది రైతులకు రూ.7.75 కోట్లు
పాచిపెంట: 5,881 (రూ.4.12 కోట్లు), మక్కువ 7,303 (రూ.5.11 కోట్లు); పాలకొండ: 8,479 (రూ.5.94 కోట్లు)
వీరఘట్టం 8,793 (రూ.6.16 కోట్లు),భామిని 6,334 (రూ.4.43 కోట్లు), సీతంపేట 9,501 (రూ.6.65 కోట్లు);పార్వతీపురం 8,880 (రూ.6.22 కోట్లు),
సీతానగరం 8,947 (రూ.6.26 కోట్లు), బలిజిపేట 7,980 (రూ.5.59 కోట్లు);
గుమ్మలక్ష్మీపురం 7,672 (రూ.5.37 కోట్లు), కురుపాం 7,184 (రూ.5.03 కోట్లు),
కొమరాడ 7,287 (రూ.5.10 కోట్లు), గరుగుబిల్లి 7,708 (రూ.5.40 కోట్లు),
జియ్యమ్మవలన 9,233 (రూ.6.46 కోట్లు) జమ కానున్నట్టు కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్ సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ,పాలక మండలి సభ్యులు,సాలూరు మండల రెవెన్యూ అధికారి బి.నీలకంఠ రావు,
సాలూరు మండలాధికారి జి.పార్వతి ,సాలూరు మండల వ్యవసాయ ఎ.డి జి సత్యవతి,సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష సాలూరు నియోజకవర్గంలోని నీటి సంఘం అధ్యక్షులు, పి.ఎ.సి సంఘం అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. (Story:రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments