ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన పద్మమ్మ w/o కురుమూర్తి, శాంతమ్మ w/o రాములు కి చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహప్రవేశాలకు వచ్చి నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేస్తారని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి )

