Home వార్తలు తెలంగాణ భవిత కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భవిత కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

0

భవిత కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : నియోజకవర్గం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు రూ.8 లక్షల వ్యయం తో చేపట్టనున్న భవిత కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారూ.ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్యార్థులకు వారికి అనుగుణంగా విద్యా బోధన అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని
బుద్ధి వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అందించే అధునాతన విద్యను సద్వినియోగం చేసుకోవాలనీ MLA సూచించారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేయడానికి నూతన వంటగది నిర్మాణానికి భూమి పూజ చేశారు.కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ, రఘు ప్రసాద్, గ్రామ నాయకులు శ్రీశైలం, చందు విద్యాశాఖ అధికారులు మహానంది ఎంఈఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : భవిత కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version