జేకే సిటీ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణ సామాగ్రి వితరణ
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలం లోని పేగ పంచాయతీ అల్లిగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి దేశయ్య అనే గిరిజనుడు పూరిగు డెసే లో జీవిస్తూ వర్షానికి గుడిసె కురుస్తున్న కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నాడు.ఈ క్రమంలో తన పరిస్థితి నీ జే. కే.సి.ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ కు వివరించడం జరిగింది. బుధవారం బాధిత కుటుంబానికి ఇంటి నిర్మాణానికి 10. సిమెంట్ రేకులు. ఇనుప పైపులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ ఎం.డి. ఇమ్రాన్ ఖాన్, సభ్యులు ఎం డి. జహంగీర్, పేగ గ్రామస్తులు పాల్గొన్నారు.(Story : జేకే సిటీ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణ సామాగ్రి వితరణ )

