Homeవార్తలుతెలంగాణ30 వార్డు విభజనలో అన్యాయం జరిగింది న్యాయం చేయండి

30 వార్డు విభజనలో అన్యాయం జరిగింది న్యాయం చేయండి

30 వార్డు విభజనలో అన్యాయం జరిగింది న్యాయం చేయండి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : 30 వార్డు విభజనలో అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. ప్రజల కోరిక మేరకు 30 వ వార్డు తిరిగి అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు పరిశీలించారు. వనపర్తి లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు సరైన విధంగా నిధులను ఉపయోగించకుండా కొందరి సలహాతో ఇస్తాను రీతిలో రోడ్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఐదు సంవత్సరాల క్రితం వార్డు విభజనలో 30 వార్డును అన్యాయంగా ఐదు వార్డులను చీల్చి ఒక వార్డుగా చేశారని దానివల్ల వార్డు అభివృద్ధి కుంటుపడిందని, మున్సిపాలిటీ కి వచ్చే ఆదాయంలో ఎక్కువగా 30 వ వార్డు నుండి వస్తుందని, జంగిడి పురం మర్రిచెట్టు నుండి అనూస్ స్కూల్ వరకు ఉన్న రోడ్డు దెబ్బతిని గుంతల మయం అయిందని, మా రోడ్డు ఎమ్మెల్యే ఇంటికి కనెక్ట్ అవుతుందని, అలాగే సివి రామన్ కాలేజ్ కింది నుండి నాగవరం పోయే రోడ్డు మొత్తం దెబ్బతిందని, క్రింద స్విమ్మింగ్ పూల్ ముందుగా ఉన్న రెండు రోడ్లు ఇంతవరకు వేయలేదని వాటిని వెంటనే సిసి రోడ్లు వేయాలని, ఎమ్మెల్యే ని కలెక్టర్ ని 30వ వార్డు ప్రజల తరఫున కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్, రామస్వామి నాగరాజు, రమేష్ ముదిరాజ్, గార్డుల శీను వార్డు ప్రజలు పాల్గొన్నారు. (Story:30 వార్డు విభజనలో అన్యాయం జరిగింది న్యాయం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!