న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా, ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులే నిలు వెత్తు నిదర్శనమని మంత్రి సవిత, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. రోడ్ల నుంచి సూపర్‌సిక్స్ వరకు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పామో చేసి చూపించిన ప్రభుత్వం తమదని గర్వంగా చెప్పగలమన్నారు. వినుకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం ప్రారంభించా రు. నరగాయపాలెం నుంచి వెంకుపాలెం వరకు రూ.4 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తారు రోడ్డు, తిమ్మాయపాలెం నుంచి దొండపాడు వరకు రూ.6 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తారురోడ్డు ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. సెల్ఫీ ద్వారా రహదారుల అభివృద్ధిని చూపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని చెప్పడానికి ఈరోజు ప్రారంభించిన రోడ్లే నిదర్శనమన్నారు. ఏడాదిలోనే రూ.6.15 కోట్లతో వినుకొండ-మార్కాపురం ఆర్‌అండ్‌బీ రహదారిని ఏర్పాటు చేశారన్నారు. తెదేపా గత ప్రభుత్వం లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నప్పుడు వేసిన చంద్రన్న బాటలే ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప గోతుల్లో ప్రాణాలు పోతు న్నా పట్టించుకోలేదన్నారు. పల్లె పండగలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో కుంభకోణాల మీద కుంభకోణాలు చేశారని, ఆ పాపాలకు ఫలితం గానే ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలుకు వెళ్తున్నారని, ఇంకా పెద్ద తిమింగలాలు ఉన్నాయన్నారు. చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 2018 ఏడాది చివరిలో మంజూరైన ఈ రహదారుల పనులను తామే ప్రారంభించామని కానీ వైసీపీ ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా పోసిన పాపాన పోలేదన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.6.15 కోట్లతో తిమ్మాయ పాలెం-దొండపాడు రహదారిని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇదేగాక రాష్ట్రవ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.861 కోట్లతో 20 వేల కిలోమీటర్లకుపైగా రోడ్లకు మరమ్మతులు చేశామన్నారు. తొలి ఏడాదిలోనే ప్రాధాన్యత క్రమంలో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు బీసీ ఉప ప్రణాళిక కింద రూ.47 వేల కోట్లు కేటాయించారని, ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తూ మంత్రి సవిత అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వినుకొండలో బాలికల బీసీ గురుకుల పాఠశాల లేదని, బీసీ గురుకుల పాఠశాలను మంజురూ చేయాలని ఈ సందర్భంగా మంత్రి సవితకు విజ్ఞప్తి చేశారు. నూజండ్ల మండలంలోని బీసీలకు ఒక మంచి భవనం నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉందని, వినుకొండ బీసీ బాలుర రెసిడెన్షియల్‌కు కూడా నిధులు కావాల్సిన అవసరం ఉందని, బొల్లాపల్లిలో బీసీ వసతిగృహం లేకపోతే అడిగిన వెంటనే వేరే నియోజకవర్గాన్ని కాదని కూడా మనకు కేటాయించారని, అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్‌ను జీవీ ఆంజనే యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొనేందుకు వినుకొండ వచ్చిన మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, లీలావతి దంపతులు ఘనస్వాగతం పలికారు. (Story :రాష్ట్రంలో మారిన పరిస్థితులకు రోడ్ల నిలువెత్తు నిదర్శనం)