మూడు కుటుంబాలను దత్తత తీసుకున్న పంచాయతీ కార్యదర్శి
న్యూస్ తెలుగు/సాలూరు : పంచాయతీ కార్యదర్శి ఆదర్శంగా నిలిచారు. మూడు కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చుటకు దత్తత తీసుకుని “నేను మార్గదర్శి”గా
మారుతూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సాలూరు మండలం జిల్లేడువలస గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్ రావు మూడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ మేరకు శనివారం సాలూరు నియోజకవర్గం పి4 (P4) కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ రావును పి4 ఉత్తమ మార్గదర్శిగా గుర్తించి నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు. (Story:మూడు కుటుంబాలను దత్తత తీసుకున్న పంచాయతీ కార్యదర్శి)
