Home వార్తలు తెలంగాణ విద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ హక్కుల సాధనకై మహా పాదయాత్ర

విద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ హక్కుల సాధనకై మహా పాదయాత్ర

0

విద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ హక్కుల సాధనకై మహా పాదయాత్ర

న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ హక్కుల సాధనకై విశ్వకర్మ JAC ఆధ్వర్యంలో జరిగే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని విశ్వకర్మ జేఏసీ చైర్మన్ రాయబండి పాండురంగ చారి తెలిపారు. స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు. అమృతోత్సవాలు జరిగినయి. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల నెరవేరింది. స్వరాష్ట్రం సురాష్ట్రం అయితదను కున్నం. సంబరాలు చేసుకున్నం. 12 ఏండ్లు గడిచినై . తెలంగాణలో పది శాతం ఉన్న విశ్వకర్మల బతుకులు మారలేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా అణచివేతకు, వివక్షకు గురవుతూనే ఉన్నం. అవకాశాలు కోల్పోతున్నం. అన్ని రంగాలల్ల వెనకబడే ఉన్నం. కారణం చాలా స్పష్టం. మనం అధికారంలో లేనందుకే విశ్వకర్మలు లేని ఊరే లేదు. ఉద్యమం లేదు. అసలు సిసలైన ఉద్యమం మారోజు వీరన్న తో మొదలైతెలంగాణ సిద్ధాంతకర్తఆచార్య జయశంకర్ సార్, శ్రీపాద శ్రీహరి మహబూబ్నగర్ కనకా చారి చివరికి శ్రీకాంతచారి బలిదానంతోతెలంగాణ వచ్చింది. మనం చేయని సేవ లేదు. మన చెమట ఇనుకని చేను లేదు. మనం చేయని వస్తువూ లేదు. దేశంల మన సేవలు, ఉత్పత్తుల ద్వారా స్వయం పోషకత్వాన్ని కల్పిస్తున్నం. దేశ సంపదను పెంచుతున్నం. పంచుతున్నం. కానీ పాలనలో మాత్రం మనం లేం. మారుతున్న కాలంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పంచదాయి వృత్తులతో నిమగ్నమై చదువుకు దూరమై ప్రభుత్వాల ఆదరణ లేక ఆగమై మారలేక పోతున్నం . గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనుభవ గల, మేధావులను యువకులను నాయకత్వ లక్షణాలు ఉన్న విశ్వకర్మలను రాజకీయ అవగాహన సదస్సులు పెడదాం. ప్రజలకు ఓట్ల విలువ తెలియ చేద్దాం. ఇకనుంచి మన ఓట్లు మనమే వేసుకుందాం . అందుకోసంసమాయాత్తం అయిదాం. ఆశయాల సాధన కోసం ఆలోచనలు పంచుకుందాం. గత అనుభవాలను కలబోసుకుందాం.కలిసికట్టుగాఅడుగులు*ముందుకేద్దాం . ఆగస్టు 12 తేదీన శ్రీకాంతాచారి చౌరస్తా నుండి అమరవీరుల స్థూపం వరకు జరిగే విశ్వకర్మ JAC ఆధ్వర్యంలో పాదయాత్రను భుజం భుజం కలిపి- గజం గజం కదలి ఉప్పెనల ఉవ్వెత్తున సాగుదాం.విజయ పథంల పరిగెడదాం . ఓట్లు, సీట్లు మనయేనని నినదిద్దాం. నిరూపిద్దాం . అంతిమ విజయం సాధించే వరకు విశ్వకర్మ జేఏసీ తో అలుపెరుగని పోరాటం చేద్దాం అని రాయబండి పాండురంగ చారి తెలిపారు. (Story:విద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ హక్కుల సాధనకై మహా పాదయాత్ర)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version