ప్రాణాలు పోతే గాని ప్రభుత్వం స్పందించదా : సిపిఐ
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ సమీపంలోని బ్రాహ్మణపల్లి పంచాయితీ, నాగిరెడ్డిపల్లి గ్రామంలో నరసరావుపేట రోడ్డు నిర్మల స్కూల్ ఎదురుగా గత మూడు రోజుల క్రితం డ్రైనేజీ మురికి కాలవలో ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోవడానికి వచ్చిన పది సంవత్సరాలు బాబు, డ్రైనేజీ మురికి కాలువలో పడి మునిగిపోతున్న సందర్భంలో ఆ పిల్లగాడితో పాటు ఉన్న తోటి పిల్లలు కాపాడండి కాపాడండి అని కేకలు వేయడంతో రోడ్డు మీద వెళ్తున్న బాటసారిలు గమనించి గంటసేపు మురికి నీళ్లలో నిలబడి ఆ బాబుని కాపాడితే గాని ఆ బాబు ప్రాణాలు నిలపడలేదు. అయినా కూడా ప్రభుత్వంకు చీమకుట్టినట్టు కూడా లేదు. బ్రాహ్మణపల్లి పంచాయతీ ఎస్సీ రిజర్వుడు లో ఉంది ఎస్సీ , ఎస్టి సబ్ ప్లాన్ నిధులు లక్షలకు లక్షలు వస్తున్న ఏమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి. గత రెండు పర్యాయాలు బ్రాహ్మణపల్లి పంచాయితీ ఎస్సీ రిజర్వులో ఉండి కూడా ఎస్సీ, ఎస్టీ లు అధికంగా ఉన్న పంచాయతీలో అభివృద్ధి ఏమాత్రం నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పంచాయతీ జిల్లా అధికారులు స్వచ్ఛభారత్ పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రేడింగ్ లిస్టు అభినందిస్తుంటే బ్రాహ్మణపల్లి పంచాయతీ లో ఉన్న నాగిరెడ్డి పల్లె, వినుకొండ పట్టణాన్ని ఆనుకొని ఈ రోడ్లో గుండా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పదేపదే తిరుగుతున్న కూడా వారికి ఈ రోడ్డు మీద ప్రవహిస్తున్న మురికి నీరు కనబడట్లేదా అని సిపిఐ పార్టీ వినుకొండ మండల కార్యదర్శి కొప్పరపు మల్లికార్జున, ప్రజాప్రతినిధుల పైన, ప్రభుత్వ అధికారుల పైన మండిపడ్డారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ. మూడు రోజుల క్రితం పసి పిల్లోడు చనిపోయే ప్రమాదాల్లో ఉన్నడని తెలిసి పత్రికల్లో వచ్చినా కూడా అధికారులు ఈ డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపర్చకుండా నిమ్మక నీరు ఇచ్చినట్టు ఉన్నారు. అధికారులు పనితనం ఎంతవరకు ఎలా ఉందో అర్థం అవుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లల్లోకి వెళ్తున్న డ్రైనేజీ వాటర్ ని యుద్ద ప్రతిపాదించిన మెరుగుపరచకపోతే బ్రాహ్మణపల్లి పంచాయతీలో ఉన్న ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాయబారం వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, దారి వేముల మరీ బాబు, సలోమి, అంజమ్మ, బ్రాహ్మణపల్లి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story:ప్రాణాలు పోతే గాని ప్రభుత్వం స్పందించదా : సిపిఐ)

