మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆయలయాల్లో ప్రత్యేక పూజలు
న్యూస్ తెలుగు/ సాలూరు : భక్తిశ్రద్ధలతో మొదటి శ్రావణ శుక్రవారం భక్తులు ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తుల ఆలయానికి చేరుకుని ప్రత్యేక కుంకుమ పూజలతో పాటు పూజలు చేశారు. అదేవిధంగా పాచిపెంట మండలం శ్యామల గౌరీపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక వసతులు కల్పించారు. శ్రావణ శుక్రవారం మొదటి వారం కావడంతో ఆలయాల వద్ద భక్తులు భారీగా వచ్చారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో శుభం జరుగుతుందని భక్తులు నమ్మకం. (Story:మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆయలయాల్లో ప్రత్యేక పూజలు)
