ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ డిపో కి చెందిన బస్సులు సమయవేళలు పాటించకుండా ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు. చెప్పాపెట్టడకుండా బస్సులు క్యాన్సల్ చేయడం..బస్సులు గురించి సరైన సమాచారం ఇవ్వకుండా ఉండటం లాంటి చేష్టలతో విసుగు తెప్పిస్తున్నారు. ముఖ్యంగా వినుకొండ, విజయవాడ రూట్ లో తిరిగే బస్సులు అసలు సమయపాలన పాటించడం లేదు. ఫ్లాట్ ఫామ్ మీద బస్సు వచ్చి ప్రయాణికులతో బస్సు నిండుగా ఉన్న బస్సు అలాగే ఉంచుతున్నారు. శుక్రవారం ఉదయం వినుకొండ డిపో కి చెందిన AP39TE6411 బస్సు విజయవాడ వెళ్లే బస్సు ఫ్లాట్ ఫామ్ కు వచ్చిన గంట తరువాత కదలడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఆర్టీసీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. (Story:ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు)

