Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తారాస్థాయికి చేరిన కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు

తారాస్థాయికి చేరిన కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు

0

తారాస్థాయికి చేరిన కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు

న్యూస్‌తెలుగు/ విజయనగరం :  కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయని, హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని, అరెస్టులపై కన్నా హామీల అమలులో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను ) అన్నారు.బుధవారం స్థానిక ధర్మపురి శిరీ సహస్ర రేసింగ్ ప్యాలెస్ తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమై కూటమి ప్రభుత్వం దాని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు చేపడుతున్న కక్ష సాధింపులు చర్యలు తారాస్థాయికి చేరాయన్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచి విశేష ప్రజాదరణ ఉన్న మిధున రెడ్డిని అరెస్టు చేయడం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందన్నారు.కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజా క్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నారు. ప్రజల తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను చూసి ఓర్వలేకే రకరకాల స్కామ్ లను తెరపైకి తీసుకుని వచ్చి వాటిని వైయస్సార్సీపీ నాయకులపై రుద్దే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంఎన్నికల హామీల అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.ఏడాది కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతుందన్నారు.
ఈ రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్న ఎవరు స్పందించలేదన్నారు. వాళ్ల తప్పులు కప్పి పుచ్చుకునేందుకు తెరపైకి లేని లిక్కర్ స్కాం తీసుకురావడం జరిగిందన్నారు.
మీ కేసులకు, అరెస్టులకు భయపడేది లేదని
– ప్రజల తరపున మా పోరాటం ఆగదన్నారు. ప్రస్తుతం వైసీపీ చేపడుతున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు.సుపరిపాలన అని చెప్పి రెండు, మూడు ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారే తప్ప ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో చెప్పలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 13 నెలలు కావస్తున్న ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకం అందలేదన్నారు. ప్రస్తుతం రైతులంతా యూరియా లేక ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడో రైతులకు ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. ఏడాది కాలంలోనే తీవ్రత వ్యతిరేకత ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల అరెస్టుల కన్నా వారిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యదర్శి నెక్కల నాయుడు బాబు, వైసీపీ అధికార ప్రతినిధి కనకాల రఘురాం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పేరు బండి జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story:తారాస్థాయికి చేరిన కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version