Home వార్తలు తెలంగాణ బైరోజు చంద్ర శేఖర్ కు ప్రతిభా పురస్కారo అభినందనీయం

బైరోజు చంద్ర శేఖర్ కు ప్రతిభా పురస్కారo అభినందనీయం

0

బైరోజు చంద్ర శేఖర్ కు ప్రతిభా పురస్కారo అభినందనీయం

న్యూస్‌తెలుగు/వనపర్తి : వంశ పారంపర్య శిల్పిబైరోజు చంద్ర శేఖర్ కు ప్రతిభా పురస్కారo రావడం అభినందనీయం అని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ జి.వామన్ గౌడ్ అన్నారు. ఇటీవల సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుండి శిల్పకళా రంగంలో “ప్రతిభా పురస్కారo” అందుకున్న శిల్పి బైరోజు చంద్ర శేఖర్ ను కొత్తకోటలో బుధవారం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను చిన్ననాటి నుండి నేర్చుకొని ఎన్నో దేవాలయాలకు వందలాది విగ్రహాలను తయారు చేయడం అభినందనీయమని అన్నారు.నలభై ఏళ్లకు పైగా సాగిన ఆయన శిల్పకళా జీవితంలో ఇలాంటి అవార్డులను అందుకోవడం కొత్త ఉత్సాహాన్నిస్తుందని సాహితీ వేత్తగా,వ్యాఖ్యాతగా కూడా బైరోజు చంద్ర శేఖర్ కు మంచి గుర్తింపు ఉందని వామన్ గౌడ్ కొనియాడారు. ఈనాటి కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాములు,పాండు కుమార్, ఉపాద్యాయులు ఈశ్వర్ రెడ్డి, మైనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. (Story:బైరోజు చంద్ర శేఖర్ కు ప్రతిభా పురస్కారo అభినందనీయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version