విద్యార్థులకు స్టీల్ గ్లాసులు వితరణ
న్యూస్ తెలుగు/వినుకొండ : జడ్పీ హై స్కూల్, ఎన్ఎస్పి కాలనీ , వినుకొండ నందు విద్యార్థులకు రాగిజావ తాగేందుకు స్టీల్ గ్లాసులను మానం నాగేశ్వరరావు అందించినట్లు పాఠశాల హెచ్ఎం. సిహెచ్.వీరప్పయ్య తెలిపారు. సుమారు 5000/ రూపాయలు విలువ గలిగిన 150 స్టీల్ గ్లాసులను వారి మిత్రులు మందటి శ్రీనివాసరావు, అత్తలూరు మల్లికార్జునరావు, నెమలపురి శ్రీనివాసరావు ల ద్వారా పాఠశాలకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఎన్. పద్మజ, పాఠశాల పీడీ ఆర్. రాధా కృష్ణ మూర్తి, ఎలీషా, రాంబాబు, ఎలిజబెత్ రాణి, గోవిందు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : విద్యార్థులకు స్టీల్ గ్లాసులు వితరణ )

