భాగ్యలక్ష్మి సేవా సమితి(బిఎల్ఎస్) స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ
సెక్రటరీ కె. భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 30 మందికి ట్రైనింగ్
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు పట్టణంలో పెద్ద కుమ్మరిపేటలో ఉన్న భాగ్యలక్ష్మి సేవా సమితి (బిఎల్ఎస్) స్కిల్ డెవలప్మెంట్ వారి కార్యా లయంలో యువతకు ఔత్సాహిక పరిశ్రమకు వేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా థ్రెడ్జ్ ఇన్ఫర్మేషన్ టేక్నలజీ ప్రోత్సాహంతో సెక్రెటరీ కె భాగ్యలక్ష్మి ఆధ్వ ర్యంలో 30 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వారి ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సాలూరు బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ద్వారపురెడ్డి.రాజశేఖర్ పాల్గొని పలుసూచ నలు సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతు సెంట్రల్ ఇంకా స్టేట్ స్కీమ్స్ పీఎంఈజిపి అలాగే ఎంయుడిఆర్ఏ డిజిటల్మార్కెటింగ్, మనీ మెంటేనేన్స్ మొదలైన వాటి గురించి వివరించి అవగాహన కల్పిం చారు.ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి సేవా సమితి అ ధ్యక్షులు గంధం సత్యవతి చేతుల మీదుగా మేనేజర్ కు చిరు సత్కారం చేసి వారి అభిమానం చాటుకున్నారు. (Story:భాగ్యలక్ష్మి సేవా సమితి(బిఎల్ఎస్) స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ)

