కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది
రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు: బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం పంటలకు మద్దతు ధరను కల్పించలేని ప్రభుత్వం అని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పచ్చగా కనిపించే పల్లెలు, నేడు మద్యం ప్రవాహాలలో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తోందని విమర్శించారు. అలాగే, వినుకొండలో తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని కట్టకుండా కాలయాపన చేస్తున్నారని, ఇందుకు ఎమ్మెల్యే ఆంజనేయులు రాజకీయ స్వార్థాలే కారణమని ఆరోపించారు. ఆసుపత్రి కడితే బ్రహ్మనాయుడు కి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆసుపత్రికి అన్ని అనుమతులు వచ్చినా కట్టకుండా నిలిపేశారని అన్నారు. వీరితోపాటు వైసీపీ నాయకులు బత్తుల చిన్నబ్బాయి, దండు చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది )
