గ్రామ మంచినీటి.. వీధిలైట్లు సమస్యను పరిష్కరించాలని సచివాలయం వద్ద ఆందోళన
న్యూస్ తెలుగు/ చింతూరు : మండలంలోని చదలవాడ పంచాయతీ లక్కవరం లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామంలోని వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామంలోని మహిళలు మహిళా సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో తులసిపాక సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించినారు.
గురువారం లక్కవరం గ్రామస్తులు ఏడాదికిపైగా వాటర్ ట్యాంక్ నుండి వాటర్ సప్లై రావడం లేదని అనేకసార్లు సచివాలయం అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. కానీ సమస్య ఏమాత్రం పరిష్కారం లేదు ఈ మధ్యకాలంలో గ్రామంలోని ఉన్న బోరింగ్లు సైతం రిపేర్ వచ్చి మురుగునీరు వాసనతో కూడినటువంటి నీరు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కూడా స్థానిక సచివాలయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కనీసం రి ప్రెస్సింగ్ కానీ బోరింగ్ మెకానిక్ తో రిపేర్ చేయించడం కానీ ఎలాంటి పనులు చేయించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో మాకు మంచి నీటిని ఏర్పాటు చేయండి అని మా నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా గ్రామంలోని వీధిలైట్లు లేకపోవడం వల్ల రాత్రి అయితే గ్రామం అంతా అంధకారంలో ఉంటుందని వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తులసి పాక కేంద్రం లో ఉన్న గ్రామ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగినది. ఈ సమస్యపై స్థానికంగా ఉన్న అధికారులు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన గ్రహించినారు అనంతరం గిరిజన సంఘం సీనియర్ నాయకులు మడకం చిన్నయ్య మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం నిత్యం అభివృద్ధి సంక్షేమ జ్యేయంగా పనిచేస్తున్నామని ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిందని మౌలిక సౌకర్యాలు తీర్చడంలో విఫలమైందని అన్నారు, గ్రామాలలో మించి నీటి ట్యాంకులు ఉన్న మోటర్లు రిపేరు అయితే కనీసం రిపేరు చేయించి ప్రజల అవసరాలు తీర్చలేని దుస్థితిలోగ్రామ పంచాయతీలు ఉన్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు, అంతే కాకుండా ఏజెన్సీలో ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని గ్రామ సచివాలయాలకు పంచాయతీలకు నిధులు కేటాయించి ప్రజల మౌలిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు సాదుల లలిత, మడకం కాంతమ్మ మడవి దుర్గ, వెంకమ్మ, సూడ ముత్తమ్మ కాదుల భద్రమ్మ గిరిజన సంఘం నాయకులు కలుముల మల్లేష్ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:గ్రామ మంచినీటి.. వీధిలైట్లు సమస్యను పరిష్కరించాలని సచివాలయం వద్ద ఆందోళన)
