Home వార్తలు తెలంగాణ పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

0

పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి : వార్డులోని ప్రజలతో కలివిడిగా తిరుగుతూ వారి యోగక్షేమాలు, వార్డులోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 19 నెలల్లోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.

ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే 3500 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని అన్నారు.

గతంలో కొన్ని బిల్డింగ్స్ కట్టి అదే అభివృద్ధి అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, ప్రజలు మాత్రం కర్రు కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తు చేశారు.

ప్రజలకు కనీస అవసరాలు అయినా మౌలిక వసతులు కూడా గత ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఇప్పటికే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపు లక్ష యాభై వేల ప్రైవేటు ఉద్యోగాల నియామకాలు చేశామని, ఒక ప్రణాళికబద్ధంగా నియామకాలు చేయడం వల్ల ఒక్క పొరపాటు కూడా జరగలేదని అన్నారు.

పైరవీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తావు లేదన్నారు. మార్నింగ్ వాక్ చేయడం అంటేనే ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం అని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకల మహేష్, స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ రమాదేవి, మధుసూదన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, బొంబాయి మన్నెంకొండ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. (Story:పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version