Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

న్యూస్ తెలుగు /వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం సంఘ కార్యాలయం ఆవరణలో కీ.శే పుట్టం రాజు, రంగనాయకమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు నారాయణ రావు, బేబీ సరోజిని దంపతులచే గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్టిఓ భువనగిరి శేష సాయి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. గత 10 సంవత్సరాలుగా సంఘ సభ్యుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, గురువారం 89వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జి నాగేంద్రుడు, గోపీచంద్, బిపిఎస్ సుందర్రావు, వైవి సుబ్బయ్య శర్మ, అవ్వారు కోటేశ్వరరావు, ఎం.వి. శర్మ, సుబ్రహ్మణ్యం, శంకర్రావు, దీక్షితులు, నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story:విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!