మాజీ సర్పంచ్ పాపన్న నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్ తెలుగు /వనపర్తి : పెబ్బేర్ మండలం గుమ్మడం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పాపన్న నాయుడు నిన్న మరణించిన విషయం గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది. పాపన్న నాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. పాపన్న నాయుడు లేని బాధ నుంచి త్వరగా కోలుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హరి కుమార్ రెడ్డి, సహదేవుడు, కృపాకర్ రెడ్డి, మహేష్ కుమార్ రెడ్డి, ఆనంద్ , యాపర్ల మాజీ సర్పంచ్ విక్రమ్ గౌడ్ , రాజు నాయక్ , గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. (Story:మాజీ సర్పంచ్ పాపన్న నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి )

