రాజారెడ్డి పాలనతో రాష్ట్రాన్ని స్వరనాశనం చేసిన జగన్
జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే 11 నుంచి 1కి పడిపోవడమూ ఖాయం
సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : రాజారెడ్డి పాలనతో రాష్ట్రాన్ని స్వరనాశనం చేసిన జగన్ ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే 11 నుంచి 1కి పడిపోవడమూ ఖాయమని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. వైకాపా నాయకులు ఇంకా “నరకండి, చంపండి” అనే భాషతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, ఈ విధమైన ప్రవర్తనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. ఈసీ కూడా విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. చైర్మన్‌గా తేలప్రోలు రమేష్ ప్రమాణం చేస్తే, పాలక మండలి సభ్యులు కూడా అదే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన జీవీ . “రాజారెడ్డి పాలన”ను గుర్తు చేస్తూ, జగన్ పాలనలో రాష్ట్రం స్వరనాశనానికి గురయ్యిందని విమర్శించారు. వ్యవస్థలు దెబ్బతినేలా చేశాడని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఏకపక్షంగా పనిచేశాడని మండి పడ్డారు. అందుకే ప్రజలు ఈ రకమైన నాయకత్వాన్ని తిరస్కరించారని, 151 సీట్ల నుంచి 11కి పడిపోవడం దానికి నిదర్శనమన్నారు. ఆ గతాన్ని గుర్తు చేసుకుని ఇకనైనా జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు అంశంపైనా మాట్లాడిన జీవీ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెల్లించిన ధరకు ఈ పొగాకు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మేలు జరిగిందని అన్నారు. ఇకపై రైతులు మరింత లాభదాయకమైన పంటలవైపు దృష్టి సారించాలన్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : రాజారెడ్డి పాలనతో రాష్ట్రాన్ని స్వరనాశనం చేసిన జగన్ )

