గర్భాపు నాగేశ్వరావు రావు మృతి పత్రిక రంగానికి తీరని లోటు
న్యూస్ తెలుగు/సాలూరు : గుండె పోటుతో సీనియర్ జర్నలిస్ట్, సాలూరు లీడర్ న్యూస్ రిపోర్టర్ గర్భాపు. నాగేశ్వరావు రావు మృతి. పత్రిక రంగానికి తీరని లోటు ఆని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైఎస్ఆర్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర అన్నారు మంగళవారం నాగేశ్వరరావు బౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు,పలు దిన పత్రికల్లో జర్నలిస్టుగా సుదీర్ఘంగా సేవలందించారని తెలిపారు. ఆయన ఆకస్మిక మృతి బాధాకరమని, ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని,ఈ సందర్భంగా నాగేశ్వరావు గారి కుటుంబ సభ్యులకు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పాంచాలి గ్రామంలో కోరికొండ రాములు భౌతికకాయాన్ని సందర్శించి ఆయనకు పూలమాలు లేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు బిసపు బాలకృష్ణ, కస్తూరి రామకృష్ణ, మేకల శంకర్రావు, మేడిశెట్టి అప్పలనాయుడు, రౌతు సురేష్, బైరెడ్డి ప్రసాద్ పలు రాజకీయ పార్టీ నాయకులు,కార్యకర్తలు, జర్నలిస్టులు,స్నేహితులు, బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు.(Story:గర్భాపు నాగేశ్వరావు రావు మృతి పత్రిక రంగానికి తీరని లోటు)
