ఆటో, టాక్సీ లారీ డ్రైవర్లకు ఉద్యోగ భృతి ఎప్పుడు..?
న్యూస్ తెలుగు/సాలూరు : మోటార్ పరిశ్రమంలో పనిచేస్తున్న ఆటో, టాక్సీ లారీ డ్రైవర్లకు 15000 రూపాయలు ఉద్యోగ భృతి ఎప్పుడ చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర ప్రశ్నించారు . సోమవారం సాలూరు పట్టణంలో గల 11, 12, 13 వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.మొదట తోట వీధిలో ఉన్న శ్యామలంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ మూడు వార్డులో ఎక్కువగా నివసిస్తున్న లారీ ,టాక్సీ, ఆటో డ్రైవర్లు ఆయనతో మాట్లాడుతూ. జగన్ 10,000 ఇచ్చేవారని సంవత్సరం గడుస్తున్న చంద్రబాబు నాయుడు 15000 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయనకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సాలూరు చంద్రబాబు నాయుడు వచ్చి ఆటోనగర్ అభివృద్ధి చేస్తామని వాగ్దానం ఇచ్చారని అది ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. స్థానిక మంత్రి సంధ్యారాణి 2024 ఎన్నికల్లో ఆటోనగర్ అభివృద్ధి చేస్తామని చెప్పారని అన్నారు. సంవత్సరం అవుతున్న ఆటోనగర్ అభివృద్ధి చేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మోటార్ కార్మికులకు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆటో టాక్సీ డ్రైవర్లకు 10,000 ఇచ్చారని. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఆటో టాక్సీ లారీ డ్రైవర్ లందరికీ 15000 ఇస్తామని చెప్పి ఇప్పుడు వరకు ఇవ్వకపోవడంతో ఆయా రంగాల్లో పనిచేసిన కార్మికులు మోసం చేశారని అన్నారు. లారీ ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తర్వాత సాలూరు రెండవ స్థానంలో ఉందని ఇక్కడ పనిచేస్తున్న మోటార్ లారీ, ఆటో, టాక్సీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సాలూరులో చింతపండు పరిశ్రమ ఎక్కువగా ఉందని పిక్క తీస్తున్న మహిళలకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు మహిళలకు కూటమి ప్రభుత్వం 18000 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కూటమి నాయకులు మోసం చేశారని అన్నారు. దళితులకు ప్రభుత్వ పథకాలు ఏవి లభించడం లేదని ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ రుణాలు తెలుగుదేశం నాయకులే లోన్లు పంచుకొని పేద గిరిజనులకు ఇవ్వకుండా చేస్తున్నారని అన్నారు. ఉద్యోగస్తులకు ఐ ఆర్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. ఇలా ప్రతి ఒక్క కులాలన్నీ ప్రభుత్వ పథకాలు రాకుండా మోసపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు. జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, కౌన్సిలర్లు గొర్లె జగన్మోహన్ రావు, వైసిపి నాయకులు గొర్లె మాధవరావు, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, కొల్లి వెంకటరమణ, ఎమ్మెస్ నారాయణ ,హరి బాలాజీ, మద్దిల గోవింద, కస్తూరి రామకృష్ణ, మేకల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.(Story : ఆటో, టాక్సీ లారీ డ్రైవర్లకు ఉద్యోగ భృతి ఎప్పుడు..? )