Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సుప్రసిద్ధ కవి కరీముల్లాకు తిరుపతి వేంకట కవుల జీవన సాఫల్య పురస్కారం 2025

సుప్రసిద్ధ కవి కరీముల్లాకు తిరుపతి వేంకట కవుల జీవన సాఫల్య పురస్కారం 2025

0

సుప్రసిద్ధ కవి కరీముల్లాకు తిరుపతి వేంకట కవుల జీవన సాఫల్య పురస్కారం 2025

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండకు చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు ఈ నెల 20 వ తేదీన హిందూపురంలో తిరుపతి వేంకట కవులు జీవన సాఫల్య పురస్కారం 2025 ప్రదానం చేయనున్నారు..భారతీయ తెలుగు సాహిత్య అకాడమీ, సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సౌజన్యంతో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల్ గౌడ్, ఉమర్ అలీషా, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు. జస్టిస్ వి.గోపాల్ గౌడ్ చేతుల మీదుగా కవి కరీముల్లాకు ఈ పురస్కారం అందజేయనున్నట్లు ఉమర్ ఫారూఖ్ ఖాన్ తెలిపారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రతిభ కనబర్చి ఇరవై ఆరు పుస్తకాలు రాసి, నూతన వచన కవితా ప్రక్రియ అబాబీలు ఆవిష్కరించిన కరీముల్లాకు ఈ పురస్కారం అందజేయటం తమకు సంతోషదాయకమని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కరీముల్లా కవిత్వం పలు భాషల్లో అనువదింపబడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఖ్యాతిని ఇనుమడింప జేసింది. పలు విశ్వవిద్యాలయంలో కరీముల్లా కవిత్వంపై పరిశోధనలు జరుగుతున్నాయి.ఎంఏ చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.కరీముల్లాకు ఈ పురస్కారం లభించడం వినుకొండ ప్రాంతానికే గర్వకారణం అని పలువురు కవులు, కళాకారులు అభినందనలు తెలిపారు.(Story:సుప్రసిద్ధ కవి కరీముల్లాకు తిరుపతి వేంకట కవుల జీవన సాఫల్య పురస్కారం 2025)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version