కాంగ్రెస్ పార్టీవి కామారెడ్డి డిక్లరేషన్ ను కప్పిపెట్టే డ్రామాలు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కాంగ్రెస్ పార్టీవి కామారెడ్డి డిక్లరేషన్ ను కప్పిపెట్టే డ్రామాలు ఆడుతోందని బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు. నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశములో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బి. సిల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ అంటూ మరోసారి మోసం చేస్తుందని ఆర్డినెన్స్ ద్వారా 42శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపిందని ఎద్దేవా చేశారు. 50శాతం బి.సి జనాభా దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలని మీ లెక్కల ప్రకారం 42శాతం రిజర్వేషన్లు ఉన్నపుడు ఎందుకు చట్టబద్దత కల్పించడం లేదని గట్టు యాదవ్ ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ,పార్లమెంట్ ఆమోదం తర్వాతనే బి.సి. రిజర్వేషన్లు అమలు అవుతాయని తెలిసి కాంగ్రెస్ పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీని బద్లాం చేయడానికి కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. కార్మిక,రైతు చట్టాలకు చట్టబద్ధత కలిపించినట్లుగానే బి.సి రిజర్వేషన్లు 42శాతానికి చట్టబద్దత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. పలుస.రమేష్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం పైగా బి. సిలు పోటీచేస్తున్నారని వారు విధులు,నిధులు లేక ఉత్సవిగ్రహాలుగా మిగిల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 90శాతము స్థానిక సంస్థలలో బి.సి,ఎస్.సి,ఎస్.టి,మైనార్టీ,దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారికి సరైన విధులు,నిధులు,కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ నుండి తప్పించుకొని బి.సి ల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు,కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ,పార్లమెంట్ ఆమోదంతో 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాల పట్ల బి.సి.నాయకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,గొర్లకాపరుల జిల్లా మాజీ అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు,వేణు యాదవ్,బొల్లెద్దుల.బాలరాజు,పృథ్వీనాథ్, కర్రేస్వామి,వడ్డే.ఈశ్వర్,కడుకుంట్ల.శ్రీను, జోహేబ్ హుస్సేన్,చిట్యాల.రాము,టి.సురేష్, గుంటి.కృష్ణ,వంశీ,మెంటేపల్లి.రామకృష్ణ,భగవంత్ యాదవ్,సవాయిగూడెం.రామకృష్ణ,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story:కాంగ్రెస్ పార్టీవి కామారెడ్డి డిక్లరేషన్ ను కప్పిపెట్టే డ్రామాలు)

